అటు హోదా.. ఇటు కోటా

Submitted by arun on Sat, 03/10/2018 - 10:41
Telugu states

తెలుగునాట రాజకీయాలు ఓ కొత్త ట్విస్టు తీసుకున్నాయి. అయితే పాత బాటలో పయనించడమే కొత్త ట్విస్టులో విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలన్నీ.. విభజనకు ముందు ఎలా నడిచాయో ఇప్పుడూ అలాగే నడుస్తున్నాయి. అప్పట్లో ఏపీ నుంచి సమైక్య నినాదాలు, తెలంగాణ నేతల నుంచి విభజన నినాదాలు పార్లమెంట్లో హోరెత్తగా... ఇప్పుడు ఏపీ నేతలు హోదా నాదం చేస్తుండగా.. టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ నినాదాలు చేస్తున్నారు. 

తెలంగాణ కావాలంటూ ఒకవైపు.. సమైక్యంగానే ఉంచాలంటూ మరోవైపు.. ఆ దృశ్యాల తీవ్రతను బహుశా ఏ తెలుగువాడూ ఇంకా మరచిపోయి ఉండడు. మొత్తానికి నిండు గర్భిణికి సుఖ ప్రసవం జరిగినట్టు... 2014లో విభజన జరిగిపోయింది. సరిగ్గా నాలుగేళ్ల తరువాత అలాంటి దృశ్యాలే ఇప్పుడు ఢిల్లీ వేదికగా హోరెత్తుతున్నాయి. అప్పుడు సమైక్య రాగం ఆలాపించిన ఆంధ్రా ఎంపీలు.. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ కేంద్ర పెద్దల చెవుల్లో జోరీగల్లాగా తయారయ్యారు. ఇక తెలంగాణ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు.. రిజర్వేషన్ల నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించాలంటూ ఓ సరికొత్త నినాదం ఎంచుకొంది. రెండు ప్రాంతాల నేతల డిమాండ్లు అప్పటి పార్లమెంట్ సెషన్ కు ఎంత ఇబ్బంది కలిగించాయో ఇప్పుడు కూడా అదే స్థాయిలో చికాకుపరుస్తున్నాయి. 

నాలుగేళ్ల క్రితం ఒకే అంశంపై పరస్పర విరుద్ధమైన డిమాండ్లతో ఉమ్మడి ఏపీ హోరెత్తింది. ఇక ఇప్పుడేమో రాష్ట్రాల్లో పరిస్థితులు మామూలుగానే ఉన్నా ప్రజాప్రతినిధులు మాత్రం ఢిల్లీ వీధుల్లో హోరెత్తిస్తున్నారు. అటు పార్లమెంట్ నూ స్తంభింపజేస్తున్నారు. మరి ఈ కొత్త చిక్కుముడిని మోడీ సర్కారు ఎలా డీల్ చేస్తుందో చూడాలి. 

English Title
Both Telugu states hit Assembly

MORE FROM AUTHOR

RELATED ARTICLES