ఆ బాలుడు.. మృత్యుంజయుడు!

Submitted by arun on Mon, 03/12/2018 - 13:46
bore well

బోరుబావిలో ఎవరైనా పడిపోయారని తెలిస్తే.. ఈ మధ్య అంతా ఆందోళన పడుతున్నారు. సిబ్బంది వైఫల్యం కారణంగా చాలాసార్లు పిల్లలు బోరు బావిలోనే చనిపోతున్న సంఘటనలు పెరుగుతుండడంతో.. ఈ ఆందోళన కూడా పెరుగుతోంది. కానీ.. మధ్యప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో మాత్రం అధికారులు శభాష్ అనిపించుకున్నారు. సిబ్బంది కూడా తమ పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు.

150 అడుగుల బోరు బావిలో పడిన నాలుగేళ్ల చిన్నారిని.. అతని తల్లిదండ్రులు సకాలంలో గుర్తించడంతో.. అధికారులు, సిబ్బంది వెంటనే ఏర్పాట్లు చేశారు. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం కలిసి సహాయ చర్యలు మొదలు పెట్టారు. బావిలో 35 అడుగుల లోతులో చిన్నారి చిక్కినట్టు గుర్తించారు. లోపలికి గాలి.. ఆక్సీజన్ పంపే ఏర్పాట్లను సమర్థంగా చేశారు. ఒకరికొకరు సహకరిస్తూ.. బాబును కాపాడే ప్రయత్నం చేశారు.

అలా ఒక రోజు గడిచిపోయింది. 35 గంటలు పూర్తయ్యాయి. బాబు బతుకుతాడో లేడో అన్న ఆందోళన.. బాధితుల్లో పెరుగుతోంది. కానీ.. అందరి ప్రార్థనలు ఫలించేలా.. అధికారులు పని చేశారు. బాలుడిని సురక్షితంగా బయటికి తీసి.. హాస్పిటల్ కు తరలించారు. ఇప్పుడు ఆ బాబు.. క్షేమంగా ఉన్నట్టు డాక్టర్లు కూడా చెప్పారు.

English Title
bore well boy rescued after 35 hours operation

MORE FROM AUTHOR

RELATED ARTICLES