ఎలక్షన్ సీజన్లో జోరుగా బెట్టింగ్స్...గెలుపోటములను ముందే చెప్పేస్తున్న బుకీలు

ఎలక్షన్ సీజన్లో జోరుగా బెట్టింగ్స్...గెలుపోటములను ముందే చెప్పేస్తున్న బుకీలు
x
Highlights

ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ పవర్ లోకి వస్తుందా..? ప్రసుత్తం అధికారంలో ఉన్న పార్టీనే మళ్లీ పగ్గాలు చేపడతాయా..? లేక అధికార మార్పిడి...

ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ పవర్ లోకి వస్తుందా..? ప్రసుత్తం అధికారంలో ఉన్న పార్టీనే మళ్లీ పగ్గాలు చేపడతాయా..? లేక అధికార మార్పిడి తప్పదా..? అధికార పార్టీ గెలిస్తే, ఎన్ని సీట్ల మెజార్జీతో గెలుస్తుంది.. విపక్షాలు గెలిస్తే, సీఎం అభ్యర్థి ఎవరు..? ఈ లెక్కలు వేస్తోంది రాజకీయ నేతలు కాదు.. బెట్టింగ్ రాయుళ్లు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.

ఎలక్షన్ సీజన్లో బెట్టింగ్ మార్కెట్ కళకళలాడుతోంది. ఏటా ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయల బెట్టింగ్ సాగుతుంది. ప్రసుత్తం జరుగుతున్న నాలుగురాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు మిశ్రమ ఫలితాలు వస్తాయని బుకీలు లెక్కలేస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కాంగ్రెస్, ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలు అధికారం చేపడతాయని బుకీలు అంచనా వేస్తున్నారు.

మధ్యప్రదేశ్ లో ప్రసుత్తం అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోందని త్వరలో జరగనున్నఎన్నికల్లో కాషాయదళానికి పరాభవం తప్పదని ఇక్కడ బుకీలు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్ ఘఢ్ లో మాత్రం బీజేపీ విజయం ఖాయమని చెబుతున్నారు. రాజస్థాన్ లో ఇప్పటికే ప్రచారంలో బీజేపీ కన్నా ముందున్న కాంగ్రెస్ అధికారాన్ని చెజిక్కించుకోవడం ఖాయమని లెక్కలేస్తున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కే ఓటర్లు మరోసారి పట్టంకడతారని చెబుతున్నారు. అయితే, మహాకూటమి నుంచి టీఆర్ఎస్ కు గట్టిపోటి తప్పదని తెలిపారు. స్థానికుల మనోభావాలకు అనుగుణంగా లోకల్ బుక్కీస్ పార్టీల జయాపజయాలపై అంచనాలు వేస్తున్నారు.

గెలుపుపై తక్కువ మొత్తం, ఓటమిపై ఎక్కువ స్థాయిలోనూ బెట్టింగులు కాస్తున్నట్టు బుక్కీలు చెబుతున్నారు. ఛత్తీస్ ఘడ్ లో బెట్టింగ్ లో పెట్టిన ప్రతిఒక్క రూపాయిలో బీజేపీకి అయితే 90పైసలు, కాంగ్రెస్ కు అయితే, రూపాయి 40పైసలు ఇస్తున్నారు. దీంతో పందెం కాసిన వారికి లాభాలు, ఆపరేటర్లకు నష్టాలు వస్తన్నాయని బుక్కీలు అంటున్నారు. మధ్యప్రదేశ్ ల్ గడిచిన 15రోజుల్లో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ఇక్కడ అధికార బీజేపీకి పరాభవం తప్పదని భావిస్తున్నారు. నెలరోజుల క్రితం వరకు ఇక్కడ కాంగ్రెస్ గెలుపుపై చాలా మందికి నమ్మకం లేకపోడంతో తక్కువ మందే హస్తంపార్టీపై బెట్టింగ్స్ కాసేవారు. అయితే, నెల రోజుల క్రితం వెయ్యి రూపాయిలు పందెం కాసిన వారు రెండింతలు డబ్బును గెలుచుకునేవారని ఇప్పుడు కాంగ్రెస్ పై పందెం కాస్తే వచ్చేది తక్కువ మొత్తమేనని బుక్కీలు చెబుతున్నారు.

రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని బుకీలు అంచనా వేస్తున్నారు. ఎడారి రాష్ట్రంలో మొదట బీజేపీ గెలుపుపై పందాలు జోరుగా సాగినా బీజేపీ యేతర కూటమి ఏర్పాటుతో కాంగ్రెస్ గెలుపుపైనే భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోని బుకీలు అసెంబ్లీ నియోజకవర్గాలు, రీజియన్స్, రాష్ట్రవ్యాప్తంగా పందాలను నిర్వహిస్తున్నారు. స్థానిన నేతల ప్రసంగాలు, రాజకీయ పరిణామల ఆధారంగా ప్రతిరోజు బెట్టింగ్ ధరలను నిర్ణయిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఇప్పటికే పోలింగ్ పూర్తయ్యంది. ఇక్కడ బీజేపీయే అధికారంలోకి వస్తందని లోకల్ బుకీలు అంచనా వేస్తున్నారు. అయితే, ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రపోటీ తప్పదని దీంతో ఇక్కడ బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని చెబుతున్న బుక్కీలు గడిచిన 15రోజుల్లో జరిగిన పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలు కూటమికి అనుకూలంగా మారాయని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories