క్రికెట్ స్టార్లతో బాలీవుడ్ క్వీన్ ల పెళ్లి

Submitted by admin on Wed, 12/13/2017 - 12:44

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లితో క్రికెట్ హీరోలు సినీ హీరోయిన్ల బంధం మరింత బలపడింది. భిన్నమైన రెండురంగాలకు చెందిన వీరి బంధం ఈనాటిది కాదు ఏనాటిదో అనుకొనేలా చేసింది. క్రికెట్ హీరోలు సినిమా హీరోయిన్ల లవ్వాట పెళ్ళిబాటపై HMTV స్పెషల్ స్టోరీ.

క్రికెట్ సినిమా చూడటానికి రెండు భిన్నమైన రంగాలు. ఈ రెంటికి ఎంత వ్యత్యాసం ఉందో సామీప్యత సైతం అంతే ఉంది. సినిమాల్లో స్టార్లు ఉన్నట్లే భారత క్రికెట్లోనూ స్టార్లు ఉండటం సాధారణ విషయమే. అంతేకాదు క్రికెట్ అవుట్ డోర్ స్టేడియాల్లో ఆడితే సినీస్టార్లకు మాత్రం సిల్వర్ స్క్రీన్లు వేదికలుగా ఉంటాయి. ఇటు క్రికెటర్లకు అటు సినీస్టార్లకు అభిమానులు ఉండటం కూడా సర్వసాధారణమే.

ఈ రెండురంగాల స్టార్ల కెరియర్ కూడా స్వల్పకాలమే. హిట్లు సాధించినంత కాలమే సెంచరీలు సాధించినంత కాలమే స్టార్లుగా వెలిగే అవకాశం ఉంటుంది. సినీస్టార్లకు క్రికెట్ స్టార్లు క్రికెట్ స్టార్లకు సినీస్టార్లు అభిమానులుగా ఉండటం, పరస్పర ఆకర్షణతో అదికాస్త ప్రేమగా ఆ తర్వాత పెళ్లిగా మారటం ఇదే మొదటిసారి కాదు. భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఆ రోజుల్లోనే బాలీవుడ్ బ్యూటీ షర్మిలా టాగోర్ ను వలచి వలపించుకొని జీవితభాగస్వామిగా చేసుకొన్నారు.

ఆ తర్వాతి కాలంలో భారత మరో కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ సైతం బాలీవుడ్ హీరోయిన్ సంగీత బిజలానీని తన వ్యక్తిగత జీవితానికే పార్ట్నర్ గా చేసుకొన్నారు. ఇక సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ సైతం ఈ మధ్యనే బాలీవుడ్ బ్యూటీ హేజిల్ కీచ్ ను తన భార్యగా చేసుకొన్నాడు. పాకిస్థాన్ మాజీ ఓపెనర్ మొహిసిన్ ఖాన్ ను బాలీవుడ్ నటి రీనారాయ్ పరిణయమాడితే. కరీబియన్ క్రికెట్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్ ను బాలీవుడ్ సంచలనం నీనా గుప్తా ఏకంగా గంధర్వ వివాహమే చేసుకొంది.

లేటుగా అయినా లేటెస్టుగా అన్నట్లు విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ ఏడడుగులు, మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావడం ద్వారా క్రికెట్ వీరులతో సినీభామల ఈనాటి బంధం ఏనాటిదో అని చెప్పకనే చెప్పారు.

English Title
bollywood-actress-married-cricketers

MORE FROM AUTHOR

RELATED ARTICLES