హ‌స్తిన‌కు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు

హ‌స్తిన‌కు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు
x
Highlights

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును ఢిల్లీకి తీసుకెళ్లింది కాంగ్రెస్. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆ సంస్థ డైరెక్టర్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ డిమాండ్...

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును ఢిల్లీకి తీసుకెళ్లింది కాంగ్రెస్. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆ సంస్థ డైరెక్టర్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ డిమాండ్ చేయనున్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరనున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో కేసులో అధికార టీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బద్నాం చేయనుంది.

ఇటీవల నల్గొండలో హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు, మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ హత్య కేసులో అధికార టీఆర్ఎస్ నేతల హస్తముందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తోంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే వేములు వీరేశం బంధువుల ఫోన్ నెంబర్లు కాల్ లిస్టులో ఉండడం కలకలం రేపింది. శ్రీనివాస్ హత్యను రాజకీయ హత్యగా ఆరోపిస్తున్న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ నుదోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది.

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ వేసింది కాంగ్రెస్. ఈ కేసును సుమోటోగా స్వీకరించాలని సీబీఐ డైరెక్టర్ ను కలిసేందుకు కోమట్ రెడ్డి బ్రదర్స్ ఢిల్లికి పయనమయ్యారు. రాజ్యసభ ప్రతిపక్షనేత గులాబ్ నబీఅజాద్ తో కలిసి సీబీఐ డైరెక్టన్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీని కలిసి..శ్రీనివాస్ హత్య కేసును పార్లమెంట్ లో ప్రస్తావించాలని కోరనున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్.

సెంటుమెంటును రగిలించడానికి కోమట్ రెడ్డి బ్రదర్స్ బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించడానికి పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ హత్య రాజకీయాలు బయటపెట్టి బద్నాం చేయాలని కోమట్ రెడ్డి బ్రదర్స్ వ్యూహం. వచ్చే ఎన్నికల్లో బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య, మున్సిపల్ చైర్ పర్స్ న్ లక్ష్మిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్ నాయకులు యోచిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ప్లానింగ్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంత లబ్ధి కలిగిస్తోందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories