75 అడుగుల లోతులో బోటు... గుర్తించిన రెస్క్యూ టీమ్

Submitted by santosh on Wed, 05/16/2018 - 12:04
boat mishap in godavari river

నిన్న సాయంత్రం గోదావరిలో మునిగిన లాంచీని రెస్క్యూ టీమ్.. ఈ ఉదయం గుర్తించింది. 75 అడుగుల లోతులో.. పూర్తిగా ఇసుకతిన్నెల్లో కూరుకుపోయిన బోటును.. వెలికి తీసేందుకు.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు.. నేవీ టీమ్ కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఇటు సుమారు 50 మందితో ప్రయాణిస్తున్న పడవలో.. ఎంతమంది చిక్కుకున్నారనేది తెలియడం లేదు. కాసేపటి క్రితమే.. ఓ బాలుడి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. దీంతో మృతుల సంఖ్యపై ఇప్పడప్పుడే క్లారిటీ రాదని చెబుతున్నారు. 

మరోవైపు పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఉదయం సీఎంవో, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సహాయకచర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. మరోవైపు ఘటనాస్థలిని స్వయంగా పరిశీలించేందుకు.. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రానున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దేవీపట్నంకు హెలికాప్టర్‌లో చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. దీంతో గోదావరి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

ఇటు సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కువ లోతులోకి వెళ్లకపోవడండంతో.. నేవీ సిబ్బంది రంగంలోకి దిగింది. గజ ఈతగాళ్లు కూడా సాయం చేస్తున్నారు. లాంచీలో ఉన్న మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు గోదావరిలో గల్లంతైన వారి కోసం బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమవారు ఎలాగైనా ప్రాణాలతో బతికి వస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే.. 16 మంది నదిలో ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. 
 

English Title
boat mishap in godavari river

MORE FROM AUTHOR

RELATED ARTICLES