వైద్యుల వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల చిత్రాలు

Submitted by arun on Thu, 06/28/2018 - 12:41

వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేయడంతో ఓ వైద్యుడిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వెయ్యి మంది డాక్టర్లున్న వాట్సాప్ గ్రూప్‌లో రవికుమార్ అనే వైద్యుడు అశ్లీల చిత్రాలను పోస్ట్ చేశాడు. ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌పై మిగతా డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో రవికుమార్‌పై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద సింగ్‌ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రవికుమార్ నిర్వాకంపై మహిళా వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ లేడీ డాక్టర్లంతా మరోసారి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

English Title
blue films shared in whatsapp group

MORE FROM AUTHOR

RELATED ARTICLES