బీఎల్‌ఎఫ్‌... ఎన్నికల జాతరలో రాజకీయ ప్రయోగం 

బీఎల్‌ఎఫ్‌... ఎన్నికల జాతరలో రాజకీయ ప్రయోగం 
x
Highlights

ఉద్యమాల ఖిల్లా గా పేరుగాంచిన ఖమ్మం జిల్లాలో ఉనికి చాటేందుకు బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) తహతహలాడుతోంది.ఒకప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలను...

ఉద్యమాల ఖిల్లా గా పేరుగాంచిన ఖమ్మం జిల్లాలో ఉనికి చాటేందుకు బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) తహతహలాడుతోంది.ఒకప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో శాసించిన సిపిఎం పార్టీ తాజాగా బిఎల్ఎఫ్ పేరుతో తన అభ్యర్థులను ప్రకటించి ప్రజల తీర్పుకోసం ప్రచార సమరానికి సన్నద్దమైంది. ఉతెలంగాణ ముందస్తు ఎన్నికల జాతరలో కొత్త రాజకీయ ప్రయోగం జరుగుతోంది. బహుజనులు, కమ్యూనిస్టులు కలిసి ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ (బిఎల్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో టిఆర్ఎస్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు ఉరకలేస్తోంది. రాష్ట్ర జనాభాలో దళితులు, గిరిజనులు, బిసిలు కలిస్తే 90 శాతానికిపైగా ఉంటారు. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో వారికి దక్కుతున్న వాట నామమాత్రమే. అందుకే ఈ వర్గాలను ఏకం చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) – సిపిఎం పూనుకుంది. బిఎల్‌ఎఫ్‌ను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేేసే తన అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే టిఆర్ఎస్ వ్యతిరేకులంతా మహాకూటమిగా ఏర్పడి పొత్తులతో
కుస్తీ పడుతున్న నేపథ్యంలో పోటీ చేేసే స్థానాల్లో స్పష్టమైన అవగాహనతో ఉన్న బిఎల్ఎఫ్ మాత్రం తన అభ్యర్థుల ప్రచారాన్ని వేగవంతం చేసింది

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఎంకు కంచుకోటగా ఉన్న సిట్టింగ్ సీటు భద్రాచలం నుండి మిడియం బాబురావును బరిలో నిలిపింది. గతంలో భద్రాచలం ఎంపిగా గెలిచిన డాక్టర్ మిడియం బాబురావు సౌమ్యుడిగా పేరుగాంచారు. నియోజకవర్గ వ్యాప్తంగా బలంగా ఉన్న సిపిఎం క్యాడర్ అంతా సిట్టింగ్ సీటును ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలనే తపనతో పనిచేస్తున్నారు. వైరా నియోజకవర్గం నుండి గిరిజన సంఘం నేత భూక్యా వీరభద్రంను పోటీలో నిలిపారు. లంబాడా గిరిజనుల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వీరభద్రం ప్రచారవేగాన్ని పెంచారు.
.సత్తుపల్లి నుండి ఐద్వా నేత మాచర్ల భారతిని పోటీలో నిలబెట్టి పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

మధిర నుండి డాక్టర్ కోటా రాంబాబు బిఎల్ఎఫ్ అభ్యర్థిగా మిగిలినవారితో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్నారు. ఇల్లందు నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుమ్మడి నర్సయ్యను బిఎల్ఎఫ్ అభ్యర్థిగా రంగంలోకి దింపడం చర్చనీయాంశంగా మారుతోంది న్యూడెమోక్రసి పార్టీకి చెందిన గుమ్మడి నర్సయ్యకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆదరణ నేపథ్యంలో బిఎల్ఎఫ్ మద్దతుతో రంగంలోకి దింపి గెలుపే లక్ష్యంగా ప్రచారవేగాన్ని పెంచారు. జిల్లాలో పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన సిపిఎం బిఎల్ఎఫ్ జెండాపై అసెంబ్లీ ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను నిలిపి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రచార సరళి వేగాన్ని పెంచుతూ బిఎల్ఎఫ్ ప్రధాన ఎజెండాను ప్రజల్లోకి
తీసుకెళ్లేందుకు విస్త్రుత సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి పాటలు కళారూపాల ద్వారా తీసుకెళుతూ వారిలో ఆలోచన కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఓటు బ్యాంకు రూపంలో ఫలితాలనిస్తాయా లేదా తెలియాంలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సందే...

Show Full Article
Print Article
Next Story
More Stories