కెనడాలో ని ఇండియన్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు

Submitted by arun on Fri, 05/25/2018 - 13:00
Bombay Bhel

కెనడాలో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. మిస్సిసౌగా ప్లాజాలో ఉన్న బోంబే భెల్‌ రెస్టారెంట్‌లో అర్థరాత్రి పేలుడు జరిగింది.  జనం జాలీగా ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరగడంతో రెస్టారెంట్‌లో ఉన్నవారంతా భయాందోళనలతో  పరుగులు తీశారు. ఈ దారుణ ఘటనలో 15 మంది గాయపడగా... వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  ప్రస్తుతం బాంబే బేల్ ఏరియాను  పోలీసులు సీజ్ చేశారు. అయితే బిల్డింగ్‌లో ఏ ప్రాంతంలో పేలుడు జరిగింది... ఆ టైమ్‌లో ఎంత మంది అక్కడ ఉన్నారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియదని పోలీసులు చెప్పారు. 

English Title
Blast at Indian restaurant in Canada

MORE FROM AUTHOR

RELATED ARTICLES