ప‌బ్లిక్ లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ప‌రువు పోయా

Submitted by lakshman on Mon, 01/15/2018 - 00:27


బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ల గొడ‌వ జుట్లు జుట్ల పట్టుకునే దాకా వ‌చ్చింది. క‌లెక్ట‌ర్, పోలీసు అధికారులు ఉన్నారు కాబ‌ట్టి స‌రిపోయేంది. లేదంటే అక్క‌డి దాకా వ‌చ్చేది. అయితే స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల వాల‌కంపై జ‌నం ముక్కున‌వేలేసుకుంటున్నారు పబ్లిక్ లో ఇలా కొట్టుకోవ‌డం ఏంట‌ని.
ఉత్త‌ప్ర‌దేశ్ కు చెందిన మ‌హిళా ఎంపీ రేఖా వ‌ర్మ‌- మ‌రో మ‌హిళా ఎమ్మెల్యే శ‌శాంక్ త్రివేది పండ‌గ సంద‌ర్భంగా దుప్ప‌ట్లు పంపిణీ కార్య‌క్ర‌మం పెట్టుకున్నారు. అనుకున్న‌టైంది వ‌చ్చిన వారిద్ద‌రు నువ్వెంతంటే నువ్వెంత అంటూ ఒక‌రిపై ఒక‌రు దూర్భ‌ష‌లాడుకున్నారు. ఇద్ద‌రు ప‌క్క‌ప‌క్క‌న నిల‌బ‌డి దుప్ప‌ట్లు పంచుతున్నారు. అంత‌లో మీడియా మిత్రులు ఫోటోలు తీసేందుకు స‌మాయాత్త‌మ‌య్యారు. ఆ స‌య‌మంలో ఫోటోలో బాగాప‌డాల‌నో..లేదంటే పేప‌ర్ కో టీవీకో ఎక్కాల‌నే ఆతృత‌తో , తాను ఫోటోలు దిగుతానంటే, తాను ఫోటోలు దిగాలంటూ ఇద్దరూ గొడవపడ్డారు. ఎమ్మెల్యే మద్దతుదారుడిని ఎంపీ కొట్టగా, ఎంపీ మద్దతుదారుడిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. ప్ర‌స్తుతం వీరిద్దరి గొడవ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

English Title
BJP, MP Rekha Verma and MLA Shashank Trivedi's fighting

MORE FROM AUTHOR

RELATED ARTICLES