స్కూల్ టాయిలెట్ ను చేత్తో శుభ్రం చేసిన బీజేపీ ఎంపీ

Submitted by lakshman on Sun, 02/18/2018 - 15:40
bjp mp janardan mishra

కొంతమంది ప్ర‌జా ప్ర‌తినిధులు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. వారిలో ఒక‌ర త్రిపుర సీఎం మాణిక్ స‌ర్కారు కాగా మ‌రొక‌రు బీజేపీ ఎంపీ జ‌నార్ద‌న్ మిశ్రా.
 త్రిపుర సీఎం మాణిక్ సర్కార్  నాలుగు సంవత్సరాలుగా ముఖ్య‌మంత్రిహోదాలో ఉంటూ సాధార‌ణంగా గడుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం త్రిపుర ఎన్నిక‌ల కోసం మాణిక్ స‌ర్కార్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆ ప‌త్రాల్లో త‌న ఆస్తి మొత్తం  రూ.3930 అని పేర్కొన్నారు. ఆయ‌న ఆస్తి చూస్తే తెలుస్తోంది. మిగిలిన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఎంత ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు  ఆయన వద్ద ఉన్న నగదు రూ.1,520 కాగా, బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు రూ.2,410, ఇళ్లు, స్థ‌లాలు లేవ‌ని పొందుప‌రిచారు. సీఎంగా వ‌చ్చిన వేత‌నాన్ని మొత్తం పార్టీకి విరాళంగా ఇస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు.
మీరేప్పుడైనా టాయిలెట్ క్లీన్ చేశారా..? చేస్తే అందులో చేయి పెట్టి శుభ్రంగా కడిగారా..? మొహం చిట్లించుకోకండి. ఓ బీజేపీ ఎంపీ మాత్రం చేతులకు గ్లౌవ్స్ కూడా తొడుక్కోకుండానే టాయిలెట్ క్లీన్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  
మధ్యప్రదేశ్ లోని రేవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జనార్దన్ మిశ్రా  ఇటీవలే ఒక గ్రామంలో ఓ పాఠశాల టాయిలెట్ ను శుభ్రపరిచి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.రేవాలోని ఖజువ గ్రామంలో ఓ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తుండగా, తామంతా బహిర్భూమి నిమిత్తం బయటకు వెళుతున్నామని చెప్పారు. మరుగుదొడ్లు సక్రమంగా లేని కారణంగా వాటిని వినియోగించడం లేదని విద్యార్థులు చెప్పడంతో, పరిశీలించిన ఆయన, ఓ చీపురు పట్టుకుని టాయిలెట్ ను శుభ్రపరిచారు. తన ఎడమ చేత్తో లోపల కూరుకుపోయిన వ్యర్థాన్ని బయటకు తీశారు. టాయిలెట్ శుభ్రపరుస్తున్న రేవా ఎంపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

English Title
BJP MP Janardan Mishra cleaning the toilet with his hands

MORE FROM AUTHOR

RELATED ARTICLES