లోకేష్‌కు 19 అవార్డులు రావడానికి కారణం కేంద్రమే: బీజేపీ నేత

Submitted by arun on Sat, 02/03/2018 - 15:48
lokesh

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో ఎంతమేర పనులు జరిగాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు... ఇప్పుడు మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. బడ్జెట్ పై అసహనం ఉంటే అడగాలి కాని, విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మంత్రి లోకేష్‌కు 19 అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులు కారణం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత బీజేపీదేనని, మిత్రపక్షంగా ఉంటూ మాపై విమర్శలు చేస్తున్న నేతలు ఒకసారి ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు.

English Title
bjp mlc somu veerraju fire on tdp government

MORE FROM AUTHOR

RELATED ARTICLES