పురుషాధిక్య భావజాలం వల్లే రామ్ మాధవ్ వ్యాఖ్యలు

Submitted by lakshman on Thu, 12/21/2017 - 20:24

బీజేపీ నేత రామ్ మాధవ్ వ్యాఖ్యలపై తీ్వ్ర దుమారం కొనసాగుతోంది. ద్రౌపదిపై రామ్ మాధవ్ కామెంట్స్ చేయడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇంకా మన సమాజంలో పురుషాధిక్య భావజాలమే కొనసాగుతుందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ద్రౌపది మొండితనం వల్లే మహాభారత యుద్ధం జరిగిందని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత రామ్ మాధవ్. ద్రౌపది ప్రపంచంలోనే తొలి ఫెమినిస్ట్ అని.. ఆమె, భర్తల మాటలు ఎప్పుడూ వినలేదన్నారు. ద్రౌపది కారణంగా జరిగిన మహాభారత యుద్ధంలో 18లక్షల మంది మృతి చెందారంటూ కామెంట్స్ చేశారు. 
పాండవుల సతీమణి ద్రౌపదిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ద్రౌపది ప్రపంచంలోనే తొలి స్త్రీవాది అని కొనియాడుతూనే.. ఆమె మొండితనం వల్లే మహాభారత యుద్ధం జరిగిందన్నారు. పనాజీలో నిర్వహించిన ఇండిక్ థాట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న రామ్ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ వారి మాట వినలేదని రామ్ మాధవ్ అన్నారు. శ్రీకృష్ణుడి మాటలనే ఆమె వేదవాక్కుగా పరిగణించేదని తెలిపారు. మహాభారత యుద్ధానికి ఆమె మొండి పట్టుదలే ఏకైక కారణమన్న రామ్ మాధవ్ ఆ యుద్ధంలో లక్షల మంది అసువులు బాసారన్నారు. రామ్ మాధవ్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.  పురుషాధిక్య భావజాలం వల్లే ఆయన అలా మాట్లాడారన్నారని విమర్శిస్తున్నారు. రామ్ మాధవ్, ఫెమినిస్ట్ అనే పదానికి అర్థమే మార్చేశారన్నారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు, కొందరు మహిళలు మాత్రం ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు.
  


 

English Title
bjp leader ram madhav comments about draupadi

MORE FROM AUTHOR

RELATED ARTICLES