హరీశ్‌రావుకు పొమ్మనలేక పొగబెడుతున్నారు: రఘునందన్ రావు

Submitted by arun on Sat, 09/22/2018 - 16:05

బీజేపీ నేత రఘునందన్ రావు అపధర్మ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో ఇంటి పోరు ప్రారంభమైందన్న ఆయన  హరీష్‌రావును పార్టీ నుంచి పంపలేక పొగబెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 105 మంది జాబితాలో తొలి మార్పు సిద్ధిపేటలోనే జరుగుతుందన్నారు.  సిద్దిపేట నుంచి కేసీఆర్‌ పోటీ చేయాలని భావిన్నాడని ఆయన అన్నారు. కారు నాలుగు టైర్లలో ఒకటి పంక్ఛర్ అయిందన్న రఘునందన్ రావు స్టెప్నీగా ఉంటాడనే సంతోష్‌ను రాజ్యసభకు పంపారంటూ వ్యాఖ్యానించారు.  

కొడుకును సీఎంగా చేసేందుకు ఎంతో మంది తెలంగాణ వాదులను బలిచేసిన సీఎం కేసీఆర్ తాజాగా  హరీష్‌రావును కూడా బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపించారు.  ఇవన్నీ బయటకు చెప్పుకోలేకే హరీష్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు తనకు సమాచారముందున్నారు. ఇలాంటి సమయంలోనే హరీష్‌రావు తెలివిగా ఆలోచించే జాతీయ పార్టీల వైపు చూడాలంటూ సలహా కూడా ఇచ్చారు 
 

English Title
BJP Leader Raghunandan Rao Sensational Comments On KCR

MORE FROM AUTHOR

RELATED ARTICLES