టీడీపీ ఆరోపణలకు బీజేపీ కౌంటర్

Submitted by arun on Fri, 03/09/2018 - 14:11
Daggubati purandeswari,

ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పూర్తి న్యాయం చేస్తుందని విజయవాడలో చెప్పారు. ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధి పనిలోనూ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని లెక్కలు వివరించారు. ఏపీకి సాయం అందించే విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.  రాజధాని నిర్మాణానికి కేంద్రం 2 వేల ఐదు వందల కోట్లు ఇచ్చిందన్న పురంధేశ్వరి..రెవెన్యూ లోటు భర్తీకి అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని వివరించారు.

English Title
bjp leader purandeswari slams chandrababu over status issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES