మజ్లిస్‌పై కృష్ణసాగర్‌ సంచలన వ్యాఖ్యలు

Submitted by chandram on Wed, 11/21/2018 - 15:17
krishna

ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను నిర్మల్‌ సభకు హాజరవకుండా ఉంటే పాతిక లక్షలు ఇస్తామన్న విషయంపై తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రూ. 25 లక్షలు ఇవ్వజూపితే మరి టీఆర్ఎస్ నుంచి ఆయన ఎంత గుత్త మాట్లాడుకున్నాడో తెలియజేయాలని డిమాండ్ చేశారు.  

కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలతో పొత్తుపంచుకోవాడాకి ఎంఐఎం రేడి అయ్యిందని, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వారికే ఒవైసీ పచ్చజెండా ఉపుతారని మండిపడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీపై కూడా దుమ్మెత్తిపోశాడు. మద్యం అమ్మకాల్లో, నేరాల పెరుగుదలలో, దేశ ద్రోహులను పెంచడంలో, మీడియాపై అంక్షలు పెట్టడంలో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందని, కాగా అవినీతి, అసత్యాలు చెప్పి ప్రజలును మోసం చేయడంలో టీఆర్‌ఎస్‌ సర్కార్ నంబర్‌ 1గా నిలిచిందని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.  

English Title
BJP Leader Krishna Sagar Rao Slams Asaduddin Owais

MORE FROM AUTHOR

RELATED ARTICLES