ఏపీకి ప్రత్యేక‌హోదా అంటే ఏంటో మోడీకి తెలియ‌దు

Submitted by lakshman on Sun, 03/18/2018 - 15:32
 bjp kishan reddy comments on modi about ap special status

మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ - బీజేపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అంశంపై బ‌డ్జెట్ లో చ‌ర్చ‌కు రాక‌పోవ‌డంపై టీడీపీ అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. దీంతో పార్ల‌మెంట్ లో ఆ పార్టీకి చెందిన నేత‌లు స్పెష‌ల్ స్టేట‌స్ అంశంపై కేంద్రంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. 
అయితే కేంద్రం ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ ఇచ్చేదిలేద‌ని తేల్చిచెప్పారు. జైట్లీ ప్ర‌క‌ట‌న‌తో అస‌హ‌నం వ్య‌క్తం చేసిన టీడీపీ ఎన్డీఏ నుంచి విడిపోయి..కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అంశంపై మాట్లాడిన తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్ కిష‌న్ రెడ్డి ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి ఏర్పడుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇచ్చిన క్ష‌ణ‌మే మ‌మ‌తా బెన‌ర్జీ - నితిష్ కుమార్ లు ఎన్డీఏ నుంచి విడిపోయి..కాంగ్రెస్ తో చేతులు క‌లిపేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే హక్కు పార్టీలకు ఉందని, తీర్మానంపై జరిగే చర్చలో అన్ని విషయాలు వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్థంగా ఉన్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కిషన్‌రెడ్డి స్పందించారు. ‘’ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ఎవరో ఇచ్చిన చీటీ చూసి అన్నారు. ప్రత్యేక హోదాపై అప్పుడు మోదీకి సరైన అవగాహన లేదు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి నెలకొంటుంది. అందుకే స్పెషల్‌ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది’’ అని చెప్పారు. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుందని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందనటం సరికాదని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ నిధులు కేటాయించారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు హితవు చెప్పారు. రానున్న ఎన్నికల్లో జనసేన, వైసీపీలతో బీజేపీ పొత్తు అంశం ఇప్పటి వరకు పార్టీలో చర్చకు రాలేదని తెలిపారు. ఏపీలో ప్రతిపక్ష నేతగా జగన్‌ను అక్కడి చంద్రబాబు ప్రభుత్వం గుర్తించగా లేనిది ప్రధాని మోడీ… వైసిపి అధినేత జగన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇస్తే తప్పేంటని కిషన్‌రెడ్డి ఎదురు ప్రశ్నించారు . 
కాగా ఇప్పటికే ఏపీకి అన్యాయం జరిగిందని అయిదు కోట్లమంది ప్రజలు రగిలిపోతుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు… పుండు మీద కారం జల్లినట్లు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయ ి. 

English Title
bjp kishan reddy comments on modi about ap special status

MORE FROM AUTHOR

RELATED ARTICLES