రూ.1000 కోట్ల పార్టీగా బీజేపీ...దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీ

Submitted by chandram on Sun, 12/02/2018 - 17:57
bjp

దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలలో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ అవతరించింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను బీజేపీకి విరాళాల రూపంలో మొత్తం 1000 కోట్లు నిధులు వచ్చాయి. బీజేపీ ఈ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆదాయ నివేదికలో వెల్లడించింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీగా బీజేపీ అవతరించింది. గత ఆర్థిక సంవత్సరం 2017-18లో బీజేపీకి విరాళాల రూపంలో వెయ్యి కోట్ల రూపాయలు వచ్చినట్లు వార్షిక ఆదాయ నివేదికలో ఎన్నికల సంఘానికి బీజేపీ వెల్లడించింది.. ఆర్థిక వ్యవహారాల్లో తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నందువల్లే తమ పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయని.. ఆ పార్టీ అధికార ప్రతినిధి గోపాల్ అగర్వాల్ తెలిపారు. 

తాజా లెక్కలతో దేశంలో అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ నిలిచింది. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్‌ అగర్వాల్‌ స్పందించారు. బీజేపీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడానికి ఆర్థిక వ్యవహారాల్లో తాము చూపే పారదర్శకత అన్నారు. బీజేపీ ప్రతి లావాదేవీని అత్యంత పారదర్శకంగా, ఆడిట్‌ నివేదికలతో సహా ఎన్నికల సంఘానికి సమర్పిస్తుందని, తాము విరాళాలను చెక్కులు, ఆన్‌లైన్‌ విధానం ద్వారానే స్వీకరిస్తామని, కొంతమంది అభిమానులు నమో యాప్ ద్వారా కూడా విరాళాలు పంపుతున్నట్టు చెప్పారు. బీజేపీ ప్రతి లావాదేవీ విషయంలో పారదర్శకంగా ఉంటుందని, ఆడిట్ నివేదికలతో సహా ఎన్నికల సంఘానికి సమర్పిస్తుందని తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలోని నాలుగు రాజకీయ పార్టీలు గతంలో కన్నా ఎక్కువ విరాళాలను పొందాయి. విరాళాల విషయంలో బీజేపీ తర్వాతి స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎంకు, సీపీఐలు ఉన్నాయి. 

English Title
BJP earned more than Rs 1,000 cr in 2017-18, Congress to file returns to EC

MORE FROM AUTHOR

RELATED ARTICLES