తెలంగాణలో షా ఆపరేషన్‌...ప్రచారానికి 15 మంది సీఎంలు

Submitted by arun on Tue, 10/09/2018 - 09:59
Amit Shah

దక్షిణాదిన తన ఉనిఖిని చాటేందుకు ఉవ్వీళ్లూరుతున్న బీజేపీ తెలంగాణను వేదికగా మలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. రోజురోజుకూ మారుతున్న సమీకరణాల దృష్ట్యా.. తెలంగాణలో తమకున్న అవకాశాలను చేజిక్కించుకునేందుకు కమలం పెద్దలు దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కనీసం 30 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వాలని కనిష్టంగా 15 సీట్లను ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 

తెలంగాణలో కమలం విచ్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడున్న 5 స్థానాలను 15 కు పెంచుకోవాలని చూస్తోంది. గ్రేటర్‌ లోనే ఉన్న జోరును జిల్లాల వరకు అటు నుంచి పల్లెల్లో కూడా పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకు తగ్గట్లుగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. కొత్త పంథాలో ప్రచారం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన 15 మంది ముఖ్యమంత్రులను కార్యరంగంలోకి దించుతోంది. 

తెలంగాణలో ఎన్నికలు.. వన్‌ సైడ్‌ వార్‌ నుంచి హోరాహోరీ సంగ్రామంగా మారినట్లు కనిపిస్తుంది. టీఆర్ఎస్‌కు గట్టి పోటీగా కనిపిస్తున్న మహాకూటమి.. ఎన్నికల్లో సత్తా చాటుతుందని చెబుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అయ్యేందుకు కమలం నాయకులు కసరత్తులు చేస్తున్నారు. అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో దూకుడు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 5 నుంచి 7 స్థానాలను సులువుగా సాధించవచ్చని అనుకుంటున్న తరుణంలో కనీసం 15 స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. 

హోరాహోరీ పోరులో 15 సీట్లు సాధించగలిగితే.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. కమలానికి దక్షిణాది కల నెరవేరినట్లే. దీంతో ఇప్పటికే పట్టున్న గ్రేటర్‌తో పాటు.. సూర్యాపేట, భూపాలపల్లి, పరిగి స్థానాలు.. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఇతర పార్టీల నేతలను ఆకర్షించే ప్రయత్నాలూ చేస్తున్నారు. 

దీనికోసం తీవ్ర కసరత్తులు చేస్తున్న బీజేపీ పెద్దలు.. ప్రచారాన్ని విభిన్నంగా నిర్వహించాలని యోచిస్తున్నారు. 15 మంది ముఖ్యమంత్రులతో పాటు.. పొరుగు రాష్ట్రాల నుంచి 100 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు రచించారు. ఈశాన్య రాష్ట్రాలు, కర్ణాటక తరహాలో ఇంటింటికీ ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 31 జిల్లాల నుంచి ఆరెస్సెస్ కు సంబంధించిన అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు.. హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 

English Title
BJP chief Amit Shah to address rally in Telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES