లైవ్‌లో యాంకర్ తలపై వాలిన పక్షి: వీడియో వైరల్

Submitted by arun on Fri, 03/02/2018 - 14:19

లైవ్‌లో వార్తలు చదివేందుకు వచ్చిన యాంకర్‌పై ఓ పక్షి వాలి కొద్దిసేపు హంగామా సృష్టించింది. అమెరికాలోని శాన్‌డియాగోలోని కెఎఫ్‌ఎంబీ ఛానెల్‌లో ఇది జరిగింది. యాంకర్‌ మెడినా, తన సహ యాంకర్‌ ఎర్రిక్‌ కహెనర్ట్‌తో కలిసి జూడే గురించి మాట్లాడుతోంది. అప్పుడే లైవ్‌లోకి ఐబిస్‌ జాతికి చెందిన ఎరుపు రంగు పక్షి వచ్చేసింది. మెడినా తలపై వాలి చక్కగా కూర్చుంది. పక్కనే ఉన్న ఎర్రిక్‌ అది చూసి పడి పడి నవ్వాడు. తలపై పక్షి కూర్చున్నా.. మెడినా ఎటువంటి కంగారు లేకుండా చాలా ప్రశాంతంగా నవ్వుతూ కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత ఆ పక్షి మళ్లీ ఎగురుతూ ఎర్రిక్‌ మీద వాలబోయి వెళ్లిపోయింది. అసలు న్యూస్‌ ప్రసారమయ్యే గదిలోకి పక్షి ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటున్నారా? మరేం లేదండి.. జూడే సందర్భంగా ఆ ఛానెల్‌ నిర్వాహకులు శాన్‌డియాగోలోని జంతు ప్రదర్శనశాల నుంచి ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆ పక్షిని తీసుకొచ్చారు. యాంకర్లు పరిచయం చేసే దాకా ఎక్కడ ఉంటాంలే అనుకుందో ఏమో అదే లైవ్‌లోకి వచ్చేసి అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకుంది.
 

English Title
Bird lands on news anchor's head

MORE FROM AUTHOR

RELATED ARTICLES