బాలికపై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సహా 18 మంది రేప్‌...7 నెలల పాటు అఘాయిత్యం

Submitted by arun on Sat, 07/07/2018 - 11:03
 Teen Raped

సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి బీహార్‌లో వెలుగుచేసింది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులకు కామంతో కళ్లు మూసుకుపోయాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ప్రిన్సిపాల్‌ సహా 18 మంది అత్యాచారం చేశారు. గడిచిన ఏడునెలలుగా జరుగుతున్న ఈ దారుణాన్ని భరిస్తూ వచ్చింది ఆ బాలిక. బిహార్‌లోని ఛప్రా జిల్లా పర్సాఘడ్‌లోని ఓ స్కూల్‌లో బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గతేడాది డిసెంబర్‌లో ఓ కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరైన ఓ క్లాస్‌మేట్‌ ఓదార్చినట్లు నటించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత స్కూల్‌ ప్రిన్స్‌పాల్‌, మరో ఇద్దరు టీచర్లు సహా ఐదుగురు విద్యార్థులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారికి జత కలిసిన మరికొందరు విద్యార్థులు అప్పటి నుంచి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ ఏడు నెలలుగా మృగవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ మధ్యే తండ్రి జైలు నుంచి విడుదల కావటంతో జరిగిన దారుణాన్ని అతనికి చెప్పుకుని కూతురు విలపించింది. దీంతో ఎక్మా పోలీస్‌ స్టేషన్‌లో తండ్రిసాయంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రిన్సిపాల్‌తోపాటు ఓ టీచర్‌ను, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు అధికారి అజయ్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం తరలించిన అధికారులు.. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు. 

English Title
Bihar Teen Raped For Months Allegedly By 18 Including Principal, Teachers

MORE FROM AUTHOR

RELATED ARTICLES