వాజ్‌పేయిని విమర్శిస్తూ పోస్ట్.. ప్రొఫెసర్‌ను చితకబాదారు

Submitted by nanireddy on Sat, 08/18/2018 - 20:31
bihar-professor-assaulted-after-post-critical-of-atal-bihari-vajpayee

దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి గురించి బీహార్‌కు చెందిన ప్రముఖ కాలేజీ ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. అందులో వాజ్‌పేయి నెహ్రూ వాది కాదు. ఆయన వాగ్థాటి పటిమతో మధ్య తరగతి భారతీయులను హిందుత్వ రాజకీయాలకు దగ్గరయ్యేలా చేయగలిగారు. ఆయన్ను నెహ్రూ వాదిగా పేర్కొనడం సముచితం కాదు.. అలా అంటే చరిత్రను వక్రీకరించడమే అవుతుంది అంటూ పోస్ట్ పెట్టారు. అతడి వాఖ్యలపై మండిపడ్డ కొంతమంది దుండగులు ప్రొఫెసర్‌ ను చితకబాదారు. భావ ప్రకటనా స్వేచ్చ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోమంటూ ప్రొఫెసర్‌ను హెచ్చరించి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రొఫెసర్‌ని రక్షించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

English Title
bihar-professor-assaulted-after-post-critical-of-atal-bihari-vajpayee

MORE FROM AUTHOR

RELATED ARTICLES