బిగ్‌బాస్-2 ఇంట్లో కొత్త బ్యూటీ

Submitted by arun on Mon, 06/18/2018 - 14:50
Nandini Rai

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ గేమ్‌లో భాగంగా ప్రతి వారం ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ అవ్వడం తప్పనిసరి. తొలి ఎలిమినేషన్లో ప్రేక్షకులు సంజనను బయటకు పంపేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో.... కొత్త కంటెస్టెంట్ ఎంటరైంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నందినీ రాయ్. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన నందినీ‌ రాయ్ లండన్ వెళ్లి ఉన్నత చదువులు చదివింది. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి పలు బ్యూటీ కాంటెస్టుల్లో పాల్గొని టైటిల్స్ దక్కించుకుంది.

2011 లో బాలీవుడ్‌లో ‘ ఫ్యామిలీ ప్యాక్ ‘ సినిమాతో సినీ కెరీర్ ఆరంభించడమే గాక.. ‘ 040 ‘ అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెటింది. ఆ తర్వాత హార్మోన్స్, మాయా వంటి తెలుగు చిత్రాలతో  పాటు కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించిన నందినీ రాయ్.. నిజానికి బిగ్ బాస్ షో మొదటిరోజే హౌస్ లో ఎంటర్ కావలసి ఉండగా..స్వల్ప గాయం కారణంగా రాలేకపోయింది.
 

English Title
Bigg Boss 2 Telugu Nandini Rai entered to the house

MORE FROM AUTHOR

RELATED ARTICLES