తెలుగు రాష్ట్రాలకు జైట్లీ షాక్‌

తెలుగు రాష్ట్రాలకు జైట్లీ షాక్‌
x
Highlights

తెలుగు రాష్ట్రాలను కేంద్రం విస్మరించింది. బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించకపోగా.. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని...

తెలుగు రాష్ట్రాలను కేంద్రం విస్మరించింది. బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించకపోగా.. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని అరుణ్ జైట్లీ ప్రస్థావించలేదు. మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులపైనా స్పందించలేదు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను అస్సలు పట్టించుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీరుపై వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమయ్యారు.

ఏపీ కేటాయింపులు ఇవే:
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు
ఏపీ నిట్‌కు రూ.54 కోట్లు
ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు
ఏపీలో ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు
ఏపీ ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు
ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌కు రూ.5కోట్లు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంకు రూ.32 కోట్లు
డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.19.62 కోట్లు
విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1400 కోట్లు
తెలంగాణకు కేటాయింపులు:
తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు
హైదరాబాద్‌ ఐఐటీకి రూ.75 కోట్లు
సింగరేణికి రూ.2 వేల కోట్ల పెట్టుబడులు

Show Full Article
Print Article
Next Story
More Stories