స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 9 మంది మృతి

Submitted by arun on Tue, 10/09/2018 - 15:08
Bhilai Steel Plant explosion

చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో సంభవించిన భారీ పేలుడులో 9 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్‌లో బొగ్గును మండించే ప్రాంతం.. పైప్‌లైన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడి, పేలుడు సంభవించింది. 9 మంది మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో 11 మందిని సమీపంలోని దుర్గ్ ఆస్పత్రికి తరలించారు. 

భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో పేలుడు సంభవించిన వెంటనే పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్లాంట్‌ను జాతీయ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది జూన్‌లోనే భిలాయి స్టీల్ ప్లాంట్‌లో అత్యాధునిక యూనిట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2014లోనూ ఫర్నేస్‌లో సంభవించిన పేలుడు ధాటికి ఇదే స్టీల్ ప్లాంట్‌లో ఆరుగురు మృతి చెందారు. దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్స్ కన్నా భిలాయ్ లోనే ప్రపంచస్థాయి అత్యుత్తమ స్టీల్ తయారవుతోంది. 3.153 మిలియన్ టన్నుల స్టీల్ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నది. ఇదే ప్లాంట్ లో వరుసగా భారీ ప్రమాదాలు జరగడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

English Title
Bhilai Steel Plant explosion 9 dead

MORE FROM AUTHOR

RELATED ARTICLES