భరత్ అనే నేను మూవీలో నాలుగు సీన్లు డిలీట్‌

Submitted by santosh on Mon, 05/07/2018 - 12:52
bharath anu nenu movie

మహేశ్‌బాబు నటించిన భరత్ అనే నేను మూవీలో...ఎన్నో సీన్లను రిలీజ్‌‌కు ముందు తొలగించారు. సినిమా నిడివి పెరుగుతుందన్న ఉద్దేశంతోనే తొలగించామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. తొలగించిన సీన్లకు నాలుగు రోజుల్లోనే యుట్యూబ్‌లో పది లక్షలకు పైగా హిట్స్ వచ్చాయ్. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు...సీన్లకు ఉన్న ప్రాధాన్యత ఎంటో. వాస్తవ పరిస్థితులను తీసిన దర్శకుడు కొరటాల...ఇంత మంచి సీన్లు ఎందుకు డిలీట్‌ చేశారని మహేశ్‌బాబు అభిమానులు బాధపడుతున్నారు. తీసేసిన సీన్లలో దేనికున్న ప్రత్యేకత దానిదే.

భరత్‌ అనే నేను మూవీలో డిలీట్‌ చేసిన సీన్లలో...రైతు వ్యవసాయం చేస్తున్న సీన్‌ కీలకమైనది. కాన్వాయ్‌లో వెళ్తున్న మహేశ్‌...రైతు పొలాన్న దున్నుతుండటంతో...కారును ఆపేసి కిందికి దిగుతాడు. దూరం నుంచే రైతుతో ఏం పంట వేశావ్ అని... సీఎంగా మహేశ్‌బాబు ప్రశ్నిస్తాడు. సోయా వేశానని రైతు చెబితే...గిట్టుబాటు అవుద్దా ? అంటూ మహేశ్‌ మళ్లీ ప్రశ్నిస్తాడు. దీనికి రైతు ఏదో ఒకటి చేయాలి కదా అని సమాధానం ఇస్తాడు.

అసెంబ్లీలో బడ్జెట్‌ ఎందుకు ప్రవేశపెట్టలేదంటూ....సీఎంను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయ్. విపక్ష సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా బడ్జెట్‌ గురించి...సీఎంను అవహేళన చేస్తారు. దీనికి అధికార పార్టీ తరపున అసెంబ్లీలో పోసాని కౌంటర్‌ ఇవ్వడంతో...ప్రతిపక్ష సభ్యులు సీట్లలో నుంచి వచ్చి స్పీకర్‌ పోడియం ముందు నినాదాలు చేస్తారు. సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్‌ సభను వాయిదా వేస్తారు. ఈ సీన్‌ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నిదర్శనం.

డిలీట్ చేసిన వాటిలో మరో సీన్‌...కుటుంబ నియంత్రణ గురించి. ముగ్గురు పిల్లలు ఉన్న మరో బిడ్డ ఎందుకు ? వారిని పోషిస్తారు. మగాడికి లేదు...నీకన్నా ఉండోద్దా బుద్ది అంటాడు సీఎం పాత్రలో మహేశ్‌.

 

English Title
bharath anu nenu movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES