దేశవ్యాప్తంగా కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన

Submitted by arun on Mon, 04/02/2018 - 12:05
'Bharat Bandh'

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దళితుల దేశవ్యాప్త బంద్‌ కొనసాగుతోంది. సంవిధాన్ బచావో సంఘర్ష్ కమిటీ అనే దళిత సంఘం ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాలు భారత్‌ బంద్‌లో పాల్గొన్నాయి. ఎస్సీ, ఎస్టీలను వేధించినట్లు ఆరోపణలొస్తే నిందితులపై అట్రాసిటీ కింద క్రిమినల్‌ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయడాన్ని నిలిపివేయాలన్నది సుప్రీంకోర్టు ఆదేశం

అయితే ఆదేశాలు తమను కించపరిచేలా ఉన్నాయని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందన్న వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దళితుల నిరసనలు మిన్నంటాయి. అందులో భాగంగానే దళిత సంఘాలు ఇవాళ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే దీనిపై స్పందించిన కేంద్రం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధమైనా ఆందోళనలు విరమించేది లేదని దళిత సంఘాలు కేంద్రానికి అల్టిమేటమ్‌ ఇచ్చాయి. 

దళిత సంఘాల నిరసనలపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. బంద్‌ విరమించుకోవాలని దళిత సంఘాలను కోరారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కేంద్రమంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌తో దళిత సంఘాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం విడ్డూరమని రవిశంకర్‌ప్రసాద్‌ అన్నారు.
 

English Title
'Bharat Bandh' on SC/ST ruling

MORE FROM AUTHOR

RELATED ARTICLES