బాలీవుడ్‌ పాటకు డ్యాన్స్‌.. ఎస్సైపై వేటు

Highlights

తనొక బాధ్యతాయుతమైన పోలీస్‌ అధికారి. అందులోనూ డ్యూటీలో ఉన్నాడు. ఆకతాయిలను కట్టడి చేయాల్సిన అతను పోలీస్‌స్టేషన్‌లోనే అందరి ముందు చిందులేసి నానా హంగామా...

తనొక బాధ్యతాయుతమైన పోలీస్‌ అధికారి. అందులోనూ డ్యూటీలో ఉన్నాడు. ఆకతాయిలను కట్టడి చేయాల్సిన అతను పోలీస్‌స్టేషన్‌లోనే అందరి ముందు చిందులేసి నానా హంగామా సృష్టించాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. పశ్చిమ్‌ బంగా రాష్ట్రం అసన్‌సోల్‌ పరిధిలోని హీరాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కృష్ణ సదన్‌ మండల్‌ ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఈనెల 2న తన పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీలో ఉండగానే సహచరులు ప్రోత్సహిస్తుండగా ఇద్దరు మహిళల ముందు బాలీవుడ్‌ పాటకు డ్యాన్స్‌ చేశాడు. కొందరు సహచరులు దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇంకేముంది ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. బుర్ద్వాన్‌ పశ్చిమ జిల్లాలోని అసన్‌సోల్‌-దుర్గాపూర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కమిషనర్‌ లక్ష్మీ నారాయణ్‌ మీనా స్పందించి ఆ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. మండల్‌ను అదే కమిషనరేట్‌ పరిధిలోని చిత్తరంజన్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories