ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు హరికృష్ణ భౌతికకాయాన్ని ఎందుకు తీసుకెళ్లలేదంటే..?

Submitted by arun on Thu, 08/30/2018 - 15:01
harikrishna

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ ముద్దుల తనయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడైన హరికృష్ణ మరణం నందమూరి కుటుంబ సభ్యులనే కాకుండా అభిమానులను కూడా ఎంతో కలచివేసింది. అంతిమ యాత్రలో ఎంతో మంది అభిమానులు పాల్గొన్నారు. అయితే మొదటగా హరికృష్ణ పార్థివదేహాన్ని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. అందుకు తగిన ఏర్పాట్లను చేసే క్రమంలో మళ్ళీ వెనక్కి తగ్గడం జరిగింది. కారణం ఇదే...శ్మశాన వాటికకు తీసుకెళ్లే ముందు భౌతికకాయానికి స్నానం చేయించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ భవన్ కు తీసుకెళ్తే మళ్లీ స్నానం కోసం ఇంటికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇదంతా ఇబ్బందులతో కూడిన వ్యవహారం కావడంతో, భౌతికకాయాన్ని పార్టీ కార్యాలయానికి తీసుకురాలేదని టీడీపీ శ్రేణులు తెలిపాయి.

English Title
behind-story-on-hari-krishna-ntr-bhavan

MORE FROM AUTHOR

RELATED ARTICLES