గడ్డం బాబుల కథ

Submitted by arun on Wed, 07/11/2018 - 16:17

రాజకీయాల్లో సవాలక్ష సవాళ్లుంటాయి. గెలుపు, ఓటములపైనా లేదా ప్రత్యర్ధులపై కక్ష తీర్చుకోడానికీ, ఇలా రకరకాల కారణాలతో  గెడ్డం పెంచుతుంటారు చాలా మంది. తమ లక్ష్యం నెరవేరే దాకా గెడ్డం తీయనని శపథాలు చేసే గడ్డం గ్యాంగులు పెరుగుతున్నాయ్ గెడ్డం బేస్డ్ కహానీలేంటి?

రాజకీయాలు స్టైల్ మార్చుకున్నాయి ఏం చెప్తున్నామన్నది ముఖ్యం కాదు ఏ స్టైల్ ఫాలో అవుతున్నామన్నది ముఖ్యం ఇప్పడు రాజకీయాల్లో గెడ్డం ఫ్యాషన్ నడుస్తోంది కొందరు ఫ్యాషనబుల్ గా ఉందనో, కొత్త ట్రెండ్ అనో గెడ్డం పెంచేస్తుంటే మరికొందరు మాత్రం ఒక లక్ష్యం కోసం గెడ్డం పెంచుతున్నామంటున్నారు అసలు  రాజకీయాలకి గడ్డానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి పవన్  గతంలో మాట్లాడారు. రాజకీయాలు గడ్డం గీసుకున్నంత ఈజీ కాదని తనను ఎద్దేవా చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. 
అది అప్పటి మాట.

తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ తన యాత్రలన్నింటినీ గెడ్డంతోనే కొనసాగిస్తున్నారు చఆయన ఎక్కడకెళ్లినా, జనం జేజేలు పలుకుతున్నారు గెడ్డంతో ఉన్న పవన్ ను చూసి కేరింతలు కొడుతున్నారు. పవన్ ఆమేరకు గడ్డం లేటెస్ట్ ఫ్యాషన్ అని నిరూపించాడు. పవన్ గడ్డం పెంచడానికి కారణం ఇది అని బాహాటంగా చెప్పలేదు యాత్ర మధ్యలో వీలు చిక్కకో  లేక యాత్రకు అది బెస్ట్ స్టైల్ అనుకున్నాడో లేక, గెలిచే వరకూ గడ్డం తీయరాదని ఆత్మ శపథం చేసుకున్నాడో తెలీదు కానీ పెరిగిపోయిన గడ్డంతోనే యాత్ర చేస్తున్నాడు పవన్.

ఇక  సీఎం రమేష్ కడప ఉక్కు కోసం 11 రోజుల నిరాహార దీక్ష చేసి ఆపై విరమించిన రమేష్ మొన్న తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేవరకూ తన దీక్ష విరమించబోనని గెడ్డం కూడా తీయననీ శపధం పట్టారాయన. కడప ఉక్కు కోసం ఉక్కు సంకల్పంతో దీక్ష చేస్తున్న రమేష్ ఇప్పటికీ తాను దీక్షలోనే ఉన్నానని , ద్రవాహారాలు మాత్రమే తీసుకుంటున్నాననీ చెప్పారు.

ఇక ఉత్తమ్ కుమార్ ఈయన గెడ్డానికి చాలా సర్వీస్ ఉంది తెలంగాణలో రాష్ట్రంలో టిఆరెస్ సర్కార్ ను గద్దె దింపే వరకూ తన గెడ్డం తీయబోనని శపథం పట్టారు. ఇక పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఒకరు ఆయనకూడా తన నియోజక వర్గానికి గండికోట రిజర్వాయర్ నీళ్లు అందే వరకూ గడ్డం తీయబోనని భీష్మించుకు కూర్చున్నారు. ఇంకాస్త వెనక్కి వెలితే కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి ఆయన ఇప్పటికీ పూర్తిగా గెడ్డం పెంచుకునే తిరుగుతుంటారు అల్లంత దూరాన ఉన్నా ఆయన జగ్గారెడ్డి అని లెక్కేసుకోవచ్చు.

ఇలా రాజకీయ చరిత్ర తవ్వితే ఎందరో గెడ్డం బాబులు కనిపిస్తారు గడ్డంతోనే తాము ప్రజల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మిగలాలను కుంటున్నారు ఏ గెడ్డం వెనక ఏ రహస్యముందో ఆ నేతలకే ఎరుక ప్రస్తుతమైతే రాజకీయాల్లో గడ్డం ఛాలెంజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ప్రత్యర్ధులు గడ్డాలపై పంచులేస్తున్నా గడ్డం తీసేది మాత్రం లేదంటున్నారీ నేతలు.

English Title
Beard Giants in Politics

MORE FROM AUTHOR

RELATED ARTICLES