కరీంనగర్‌ నడిబొడ్డున ఎలుగుబంటి హల్‌చల్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 11:32

కరీంనగర్‌ నడిబొడ్డున ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ఈ తెల్లవారు జామున 3 గంటలకు సమీపంలోని అటవీ నుంచి వచ్చిన ఎలుగుబంటి రోడ్లపై రౌండ్లు కొట్టింది. తర్వాత టవర్‌ సర్కిల్‌ లోని బీఎస్‌ఎన్‌ ఎల్‌ టవర్‌ వెనుక ఉన్న చిన్న ఆఫీస్‌లోకి వెళ్లి దాక్కుంది. దీంతో విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన అటవీ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎలుగుబంటిని పట్టుకునేందుకు నాలుగు గంటలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చేందుకు వరంగల్‌ నుంచి ప్రత్యేక రెస్క్యూ టీం కరీంనగర్‌కు రప్పిస్తున్నారు. ఎలుగుబంటి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. జనసంచారం ఉన్న ప్రాంతంలో ఎలుగుబంటి రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 
 

English Title
Bear Hulchul in Karimnagar

MORE FROM AUTHOR

RELATED ARTICLES