ఎండిపోయిన తులసి ఇంట్లో ఉంటే ?

Submitted by lakshman on Sat, 09/16/2017 - 21:53

భారతీయ సనాతన జీవన విధానంలో తులసి ఓ భాగమైపోయింది. హిందువులు తులసిని పూజల కోసమే కాకుండా, ఆరోగ్యం పరంగానూ దీని ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. ఇళ్లలో తులసి మొక్కకు కోటను నిర్మించి నిత్యం పూజిస్తారు. రోజూ తులసి మొక్కకు నమస్కారం చేసి తాకితే శుభం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ మొక్కను ఇంట్లో ఉంచుకోగానే సరిపోదు. తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. తులసి చెట్టు ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచరాదు, అలాగే దాన్ని తాకరాదు.తులసి ఆకులను ఏకాదశి రోజు, ఆదివారం రోజు, రాత్రి సమయాల్లో తుంచకూడదు. అలాగే గ్రహణ సమయాల్లోనూ వీటిని తుంచడం అరిష్టం. తులసి వద్ద రోజూ దీపం వెలిగించి పూజ చేయాలి. ముందు తులసి అనుమతి తీసుకుని ఆ తర్వాత మాత్రమే ఆకులను తుంచాలి. తులసి ఆకులు నోట్లో వేసుకుని నమలరాదు. ఎందుకంటే వీటిలోని ఆమ్లం దంతాలకు హాని చేస్తుంది. కాబట్టి నీళ్లలోనూ లేదా టీలోనూ కలిపి తీసుకోవాలి.ఆరోగ్యం, మతపరమైన అవసరాలకే మాత్రమే తులసి ఆకులను తుంచాలి. అకారణంగా తుంచడం పాపం. ఎండిపోయిన ఆకులు రాలితే వాటిని ఊడ్చకూడదు. ఆ మొక్క సమీపంలోనే గుంత తీసి వాటిని పూడ్చాలి. తులసి మొక్క ఎండిపోతే దాన్ని నదీ జలాల్లో లేదా చెరువులోగానీ వేయాలి. అలాగే ఎండిపోయిన తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది కాదు.

English Title
basil tree in house

MORE FROM AUTHOR

RELATED ARTICLES