పదేళ్లలో మునిగిపోనున్న బ్యాంకాక్

పదేళ్లలో మునిగిపోనున్న బ్యాంకాక్
x
Highlights

బ్యాంకాక్ గురించి అక్కడి అందమైన బీచ్‌ల గురించి వినని వారు ఉండరు.ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వివిధ దేశాల నుండి అక్కడకు పర్యటనకు వస్తారు.ఒక రకంగా...

బ్యాంకాక్ గురించి అక్కడి అందమైన బీచ్‌ల గురించి వినని వారు ఉండరు.ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వివిధ దేశాల నుండి అక్కడకు పర్యటనకు వస్తారు.ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకాక్ లో ఎక్కువ మంది తమ జీవనాన్ని సాగించేది పర్యాటకం మీదనే.అటువంటి బ్యాంకాక్ కేవలం పదంటే పదేళ్లలో 40 శాతం వరకు సముద్రగర్భంలో కలిసిపోతుందని దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని తేల్చి చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

బ్యాంకాక్‌కు రక్షణగా ఉండే మడ అడవులను ఎక్కువగా నరికివేయడంతో పాటు నదుల,వాగులకు అడ్డంగా సాగించిన నిర్మాణాల వల్ల తీరప్రాతం తగ్గిపోయి,సిటీ పెరిగిపోయింది.దీని వల్ల ఏటా నాలుగు మిల్లీ మీటర్ల చొప్పున సముద్ర మట్టం పెరిగిపోతుంది.గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఏకంగా బ్యాంకాక్ లోని 20 శాతం భూభాగం నీళ్లలో మునిగిపోయింది.భారీ వర్షాలు కురిసిన మరుసటి ఏడాది నుంచి నీటి మట్టం సంవత్సరానికి 2 సెంటీమీటర్లు పెరుగుతూ పోతుంది.ఇది ఇలాగే కొనసాగిగే బ్యాంకాక్ ని మనం అత్యంత సమీప భవిష్యత్తులు చూసే అవకాశం కోల్పోతాం.

Show Full Article
Print Article
Next Story
More Stories