ఈనెల 21నుండి 26వరకు బ్యాంకులు బంద్.. నగదు కోసం..

Submitted by nanireddy on Thu, 12/06/2018 - 08:16
bank hollydays in this month

గత నెలలో  బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. దాంతో అప్పటికే ఏటీఎంలలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజలు ఆ సమయంలో మరింత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అదే ప్రాబ్లెమ్ మళ్ళీ రాబోతుంది. ఈనెలలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. 

21న ఆలిండియా బ్యాంకు ఆఫీసర్ల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. 22 నాలుగో శనివారం..  23న ఆదివారం. ఇక సోమవారం 24న ఒక్కరోజు బ్యాంకులు పనిచేయనుండగా 25న క్రిస్మస్ సెలవు. మళ్ళీ 26 యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకి పిలుపునిచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా,  దేనా బ్యాంకు, విజయా బ్యాంకుల  విలీనాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబరు 26న సమ్మె చేపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులకు వరుస సెలవులు ఉండటంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల వినియోగదారులు ముందుగానే నగదు డ్రా చేసుకుంటే మంచిదని చెప్పకనే చెబుతున్నాయి బ్యాంకుల. 

English Title
bank hollydays in this month

MORE FROM AUTHOR

RELATED ARTICLES