రేణుకు ప‌వ‌న్ విషెస్‌పై బండ్ల గ‌ణేష్ ట్వీట్‌!

రేణుకు ప‌వ‌న్ విషెస్‌పై బండ్ల గ‌ణేష్ ట్వీట్‌!
x
Highlights

మరో వివాహానికి సిద్ధమైన తన మాజీ భార్యకు విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్ పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రేణూ దేశాయ్ కి ఇటీవల...

మరో వివాహానికి సిద్ధమైన తన మాజీ భార్యకు విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్ పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రేణూ దేశాయ్ కి ఇటీవల నిశ్చితార్థం కాగా, తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కల్యాణ్ అభినందనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్‌పై ప‌వ‌న్ అభిమానులతోపాటు, ప‌వ‌న్‌ను ఎంత‌గానో అభిమానించే నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా స్పందించారు. ప‌వ‌న్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బండ్ల గ‌ణేష్‌.. `మా బాస్ అంటే ఇది` అంటూ ప్ర‌శంసించారు. ఇక ప‌వ‌న్ ట్వీట్ ప‌ట్ల ఆయ‌న అభిమానులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి స్వ‌చ్ఛ‌మైన మ‌నస్తత్వ‌మే త‌మ‌ను ఆక‌ర్షిస్తోంద‌ని ప‌వ‌న్ అభిమానులు ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories