మ‌హేష్ బాబుపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించిన బాల‌య్య‌

Submitted by lakshman on Mon, 01/15/2018 - 14:26
bkm

జైసింహ‌తో మాంచి జోరుమీదున్న బాల‌కృష్ణ ఓ మీడియా ఇంటర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. రీమేక్ సినిమాలు చేస్తారా అన్న ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన ఆయ‌న డైర‌క్ట‌ర్ కెఎస్ రవికుమార్ త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన ఓ సినిమా రిమేక్ చేద్దామ‌ని ప్ర‌స్తావించార‌ట‌. అందుకు బాల‌య్య రిమేక్ లు చేస్తే మ‌న‌కుచ్చే పేరు ఏమీ ఉండ‌ద‌ని అందుకే అలాంటి సినిమాలకు దూరంగా ఉన్న‌ట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇప్పటి దాకా రీమేకే చేయని హీరోగా మహేష్ బాబు ఒక్కడే తన ట్రాక్ రికార్డు అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు అంటూ బాల‌య్య‌ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురింపించాడు. ఇదిలా ఉంటే గ‌తంలో బాల‌య్య రిమేక్ లు తీసి హిట్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్  ముద్దుల మావయ్య ను తమిళ సినిమా ‘ఎన్ తంగాచ్చి పడిచివా’ . మంగమ్మ గారి మనవడు కూడా తమిళ్ ‘మన్ వాసనై’ నుంచి తీసుకుందే. విక్రం ‘సామీ’ని తెలుగుకు అనుగుణంగా మార్చి లక్ష్మి నరసింహ తీస్తే అది కూడా చక్కని విజయాన్ని అందుకుంది.   

English Title
balakrishna talk about mahesh babu

MORE FROM AUTHOR

RELATED ARTICLES