నటుడిగా, నిర్మాతగా ’యన్టీఆర్‘ను తెరకెక్కించడం ఆనందంగా ఉంది: బాలకృష్ణ  

Submitted by arun on Sat, 08/04/2018 - 12:42
bk

తన తండ్రి బయోపిక్ యన్టీఆర్ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా తాను వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందన్నారు హీరో నందమూరి బాలకృష్ణ. ’యన్టీఆర్‘ చిత్రీకరణ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం స్వాగ్రామమైన కృష్ణ జిల్లా నిమ్మకూరులో పర్యటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి యన్టీఆర్ బాల్యంపై చిత్రీకరణ జరిపేందుకు దర్శకుడు క్రిష్ తో కలిసి లోకేషన్ల ను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని యన్టీఆర్ దంపతుల విగ్రహాలకు బాలకృష్ణ పూల మాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. జనవరి 9న యన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అక్టోబరు, నవంబరులో నిమ్మకూరు, కోమరఓలులో యన్టీఆర్ చిత్రీకరణ జరపనున్నట్లు వివరించారు. 

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. యన్టీఆర్ చిత్రానికి దర్శకత్వం వహించడం తన పూర్వజన్మ సృకృతంగా భావించారు. అందరూ మెచ్చే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. నిమ్మకూరులో యన్టీఆర్ బాల్య సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో యంగ్ యన్టీఆర్ గా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ నటించనున్నారు. ఇందుకు సంబంధించి ఫిట్ నెస్ కోసం ఆయన ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు. మోక్షజ్ఞ రాగానే యన్టీఆర్ బాల్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రామారావు మొదటి చిత్రం మనదేశంలోని గెటప్ ద్వారా ఇటీవల యన్టీఆర్ సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభించన సంగతి తెలిసిందే.
 

English Title
balakrishna ntr biopic

MORE FROM AUTHOR

RELATED ARTICLES