ముందు చూస్తే నుయ్యి..వెన‌క చూస్తే గొయ్యి

Submitted by arun on Fri, 01/12/2018 - 11:56
jai simha movie

బాలయ్య ఖాతాలో హిట్ పడింది. సంక్రాంతి పందెంకోడిలా సినీ బరిలోకి దిగిన జై సింహా టీం కష్టానికి తగిన ఫలితం దక్కింది. పాజిటివ్ టాక్ వచ్చిన జైసింహాకు డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ రాసుకున్న పకడ్బందీ స్క్రీన్ ప్లే ఎంతో బలాన్నిచ్చింది. బాలయ్యకు తగ్గట్లుగానే మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. జైసింహా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ముందు వినిపించే డైలాగ్స్ ఈలలు వేయిస్తాయి. యాక్షన్ సీన్స్ టెన్షప్ పెంచుతాయి. సెంటిమెంట్‌తో పాటు బ్రాహ్మిణ్ సీన్, ధర్నా సీన్... అమ్మకుట్టి సాంగ్ అన్నీ సీనిమాకు ప్లస్ పాయింట్ గా మారాయి. అయితే జై సింహా పూర్తిగా మాస్ సినిమా. ఇదే ఈ చిత్రం మైనస్ పాయింట్. అలాగే ఫార్ములా బేస్డ్ స్టోరీ కావడం మరో బలహీనత. ఇక నయనతార మినహా మిగతా ఇద్దరు హీరోయిన్లు  ఆకట్టుకోలేకపోయారు. సినిమాలో చివరి పావుగంట కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. 

English Title
balakrishna jai simha movie plus points and minus points

MORE FROM AUTHOR

RELATED ARTICLES