ప్రేమ వివాహం చేసుకోబోతున్న సైనా, కశ్యప్...

Submitted by arun on Wed, 09/26/2018 - 12:06
Saina, Kashyap

భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన సహ ఆటగాడు, బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ ను ఆమె వివాహం చేసుకోనుంది. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. .వీరి కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాహానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. వచ్చే డిసెంబర్‌లో హైదరాబాద్ వేదికగా అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించడంతో డిసెంబర్ 16న దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగే వివాహం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్‌కు అన్ని రంగాల ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
 

Tags
English Title
Badminton stars Saina, Kashyap to tie the knot in December

MORE FROM AUTHOR

RELATED ARTICLES