మూడు రోజుల పసికందు కిడ్నాప్‌..గంటలవ్యవధిలో కేసును చేధించిన పోలీసులు..

Submitted by nanireddy on Tue, 07/10/2018 - 12:06
baby-kidnap-case-in-Adilabad

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో మూడు రోజుల పసికందు కిడ్నాప్‌కు గురైంది. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ప్రసూతి వార్డు నుండి మగబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. తల్లిపక్కలో ఉండాల్సిన చిన్నారి కనిపించకపోయే సరికి.. బంధువులు.. ఆస్పత్రి ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అలర్టైన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇచ్చోడలో ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. కిడ్నాపర్‌ను గుర్తించారు. ఐదు గంటల వ్యవధిలో కేసును ఛేదించారు. కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ ఘటన మరువక ముందే ఆదిలాబాద్ రిమ్స్‌లో మరో కిడ్నాప్ జరగడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. 

English Title
baby-kidnap-case-in-Adilabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES