పుట్టుకతోనే బంపర్ ఆఫర్ కొట్టేసిన చిన్నారి

Submitted by arun on Thu, 07/26/2018 - 14:20
Texas

అదృష్టం అంటే ఈ పాపదే. జీవితాంతం ఓ రెస్టారెంట్‌లో ఉచితంగా భోజనం చేసే అవకాశం కొట్టేసింది. అంతేకాదు ఆ హోటల్‌ ఆ బుజ్జిపాపకు ఉద్యోగం ఆఫర్ కూడా ఇచ్చింది. ఎందుకు అనుకుంటున్నారా..? ఆ పాప వాళ్ల రెస్టారెంట్ లోనే పుట్టింది. అందుకే ఈ అవకాశాలు చిట్టితల్లికి ఈ అవకాశాలు. ఈ నెల 17న టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఉన్న చిక్ ఫిల్ ఎ రెస్టారెంట్‌కు రాబర్ట్ గ్రీఫిన్, మ్యాగీ దంపతులు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. అదే సమయంలో మ్యాగీకి పురిటి నొప్పులు రావడంతో రెస్ట్ రూమ్‌కు వెళ్లారు. తన స్నేహితుడి కారులో పిల్లలను ఇంటికి పంపించిన రాబర్ట్... రెస్ట్ రూమ్‌లో భార్యపక్కనే ఉండి సపర్యలు చేశాడు. పండంటి పాపాయికి జన్మనిచ్చింది మ్యాగీ. దీంతో ఆ ఇద్దరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన ఎమర్జెన్సీ వెహికిల్‌లో హాస్పిటల్‌కు వెళ్లారు. తమ హోటల్‌లో పాప పుట్టినందుకు యాజమాన్యం తనకు లైఫ్ లాంగ్ ఫుడ్ ఫ్రీ అని, తను పెరిగి పెద్దయ్యాక తమ రెస్టారెంట్‌లోనే ఉద్యోగం కూడా కల్పిస్తామని పేర్కొంది. దీంతో ఈ విషయాన్ని రాబర్ట్ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ చిట్టితల్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 

English Title
Baby girl born in Texas Chick-fil-A gets free food for life and a future job

MORE FROM AUTHOR

RELATED ARTICLES