బాబు కోపం... మోడీపైనా... బీజేపీపైనా... సీబీఐపైనా?

బాబు కోపం... మోడీపైనా... బీజేపీపైనా... సీబీఐపైనా?
x
Highlights

దేశంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఆ రెండు చోట్లా అధికారంలో ఉండే పార్టీలను బట్టి మారుతూ ఉంటాయి. రెండు చోట్ల ఒకే పార్టీ లేదా కూటమి ఉన్నప్పుడు...

దేశంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు ఆ రెండు చోట్లా అధికారంలో ఉండే పార్టీలను బట్టి మారుతూ ఉంటాయి. రెండు చోట్ల ఒకే పార్టీ లేదా కూటమి ఉన్నప్పుడు పెద్దగా వివాదాలు రాలేదు. రెండు చోట్లా వేర్వేరు పార్టీలు ఉన్నప్పుడు మాత్రం ఆ సంబంధాలు ఉప్పు, నిప్పులా ఉంటున్నాయి. స్థూలంగా చూస్తే రాష్ట్రాల కన్నా కేంద్రానికి అధికారాలు ఎక్కువే. ఆ అధికారాలను తమకు వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని రాష్ట్రాల లోని ప్రభుత్వాలు భావించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో జీఎస్టీ, పెట్రో ధరలు లాంటి ఆర్థిక అంశాలపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు నడిచాయి. ఇక ఇప్పుడు ఈ ప్రభావం కేంద్ర దర్యాప్తు సంస్థల పై కూడా పడుతోంది. ఆంధ్రప్రదేశ్ సీబీఐ ఇకపై దర్యాప్తులు జరపడాన్ని నిరోధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించే యోచన చేస్తోంది. మొత్తం పై ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారనున్నట్లుగా కనిపిస్తోంది.

బీజేపీతో అనుబంధం తెగిపోయాక.... కేంద్రాన్ని ఎదిరించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మొన్నటి వరకూ పలు విపక్షాలను
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రప్రభుత్వంపై గత కొన్ని నెలలుగా విరుచుకుపడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ కూడగట్టడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ సీబీఐ కి నో ఎంట్రీ చెప్పడంతో ఇతర రాష్ట్రాలు కూడా అదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. తద్వారా కేంద్రం, రాష్ర్టాల మధ్య ఈ అంశం సంఘర్షణకు దారి తీసే అవకాశం కూడా ఉంది. అయితే ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ జరగడం, వివిధ రాష్ట్రాలు, సీబీఐ మధ్య ఘర్షణ జరగడం కొత్త అంశం ఏమీ కాదు. పలు సందర్భాల్లో ఇలాంటి ఘర్షణలు కోర్టు మెట్లు ఎక్కిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదే విధంగా వివిధ అంశాల్లో సీబీఐ పై న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

విపక్షాలు మరోసారి సంఘటితం అయ్యేందుకు నో ఎంట్రీ అంశం మరోచక్కటి అవకాశాన్ని అందించినట్లయింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అండగా నిలిచారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి ఏర్పాటుపై ఆమె త్వరలోనే ఏపీ సీఎంతో సమావేశం కానున్నారు. ఆ లోగానే కేంద్రం పై పోరాడేందుకు చంద్రబాబు ఆమెకు ఒక చక్కటి ఆయుధాన్ని అందించినట్లయింది. చంద్రబాబు నాయుడు సీబీఐకి నో ఎంట్రీ చెప్పడంపై ఆమె హర్షం వ్యక్తంచేశారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకొని కేంద్రం సీబీఐ అస్త్రాన్ని ప్రయోగిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చేసింది సరైన పని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అదే పని చేయాలనుకుంటున్నదని అన్నారు. మొత్తం మీద మరికొన్ని రాష్ర్టాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది.

మొత్తం మీద చూస్తే అటు బీజేపీ, ఇటు యాంటీ - బీజేపీ......రెండిటి వాదనల్లోనూ నిజం ఉంది. ఇతర సందర్భాలు ఎలా ఉన్నప్పటికీ, ఎన్నికలు జరిగే సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని దుర్వినియోగం చేసిన దాఖలాలు కూడా అనేకం ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానమే సీబీఐని పంజరంలో చిలుక అని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సీబీఐ చిలుక పలుకులే అందుకు కారణం. ఒకప్పుడు కాంగ్రెస్ తన ప్రయోజనాల కోసం సీబీఐని దుర్వినియోగం చేసింది. ఆ తరువాత బీజేపీ కూడా అదే బాట పట్టింది. ఒకప్పుడు కాంగ్రెస్ గూటిలో ఉన్న చిలుక ఇప్పుడు బీజేపీ గూటి లోకి చేరింది. దాని వ్యవహార శైలిలోనూ మార్పు వచ్చింది. అలాంటి చర్యల కారణంగానే సీబీఐ విశ్వసనీయత కోల్పోయింది. వివిధ కేసుల విచారణ సందర్భాల్లో సీబీఐ మాట మార్చిన ఉదంతాలు కూడా అనేకం ఉన్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా సీబీఐని తన ఇష్టానుసారంగా వాడుకోవడం ఆనవాయితీగా మారింది. అందుకోసమే సీబీఐకి కూడా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ కూడా తెర పైకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మోడీ సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా అభివర్ణించారు. తాజాగా సీబీఐ ....బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో సీబీఐ వేధింపులకు మమతా బెనర్జీ గురయ్యారు. అందుకు ప్రతీకారంగా ఆమె బెంగాల్ లోని బీజేపీ నాయకులపై రాష్ట్ర పోలీసులతో కేసులు పెట్టించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories