బాబు బాటలో తమ్ముళ్లు నడుస్తారా?

బాబు బాటలో తమ్ముళ్లు నడుస్తారా?
x
Highlights

ఎన్ని సీట్లిస్తారో తేల్చడం లేదు. ఏయే స్థానాలొస్తాయో చెప్పడం లేదు. అయినా, తమదైన సామ్రాజ్యంలో జెండా ఎగరేసేది మనమేనంటూ, తెలంగాణ టీడీపీ నేతలకు కర్తవ్యబోధ...

ఎన్ని సీట్లిస్తారో తేల్చడం లేదు. ఏయే స్థానాలొస్తాయో చెప్పడం లేదు. అయినా, తమదైన సామ్రాజ్యంలో జెండా ఎగరేసేది మనమేనంటూ, తెలంగాణ టీడీపీ నేతలకు కర్తవ్యబోధ చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. సీట్ల పంపకాలు-ఉమ్మడి మ్యానిఫెస్టో కొలిక్కివస్తున్న టైంలో, హైదరాబాద్‌లో ల్యాండయిన బాబు, ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ నేతలకు మార్గదర్శనం చేశారు. ఇంతకీ, టీటీడీపీ కీలక నేతలతో చంద్రబాబు సమావేశం సారాంశమేంటి?

తెలంగాణలో టీఆర్ఎస్‌ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని.. పొలిట్‌ బ్యూరో సభ్యులకు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. మహాకూటమి పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో సమావేశం అయిన చంద్రబాబు.. భవిష్యత్ కార్యాచరణపై ఆరా తీశారు. కూటమి పొత్తులో భాగంగా పార్టీకి కనీసం 15 సీట్ల వరకు దక్కే అవకాశం ఉన్నట్లు.. పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ.. చంద్రబాబుకు తెలిపారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. తెలంగాణ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. సుమారు గంట పాటూ సమావేశమైన చంద్రబాబు.. పొత్తులు, ఎత్తులు, ప్రచారం, సీట్ల సర్దుబాట్లపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశానికి బలమున్న స్థానాలతోపాటు.. కూటమి పొత్తులో భాగంగా వచ్చే స్థానాల లిస్టును.. అధ్యక్షుడు ఎల్ రమణ చంద్రబాబుకు అందజేశారు. గ్రేటర్‌తో పాటు.. ఏపీ సరిహద్దు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఫలితాలు వస్తాయని వివరణ ఇచ్చారు. అయితే తాము 30 సీట్లు అడిగితే.. పొత్తులో భాగంగా.. అందులో సగం వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఇదే అంశంపై చర్చించిన చంద్రబాబు.. పార్టీకి బలమున్న స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరాదని.. చంద్రబాబు తెలిపారు. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ రాష్ట్రమంతా ప్రయోజనం పొందుతుందని.. ఈ విషయాన్ని తెలియజేస్తూ మరన్ని సీట్లు అడగాలని సూచించారు. సీట్ల కంటే.. టీఆర్ఎస్‌ ను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని.. చంద్రబాబు సూచించారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. కాంగ్రెస్‌ తక్కువ సీట్లు ఆఫర్‌ చేసినా.. కేసీఆర్‌ను ఎదుర్కొనే వ్యూహంతో ముందుకు వెళ్దామని.. చంద్రబాబు సూచించారు. కాంగ్రెస్‌తో పొత్తును జాతీయ కోణంలో చూడాలని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories