దంగల్‌ రికార్డు ను చెరిపేసిన బాహుబలి

దంగల్‌ రికార్డు ను చెరిపేసిన బాహుబలి
x
Highlights

తెలుగు సినిమాయే కాక భారతీయ సినీ చరిత్రలో భారీవిజయం నమోదు చేసుకున్న చిత్రం బాహుబలి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కంక్లూషన్ పేరుతో విడుదలైన ఈ రెండు...

తెలుగు సినిమాయే కాక భారతీయ సినీ చరిత్రలో భారీవిజయం నమోదు చేసుకున్న చిత్రం బాహుబలి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కంక్లూషన్ పేరుతో విడుదలైన ఈ రెండు సిరీస్ లు టాలీవుడ్ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. కదా కధనం తోపాటు నటీనటుల ట్యాలెంట్, కీరవాణి మ్యూజిక్, రాజమౌళి టేకింగ్ కలిసి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. గత సంవత్సరం విడుదలైన ఈ బాహుబలి కంక్లూషన్ చిత్రానికి ఏకంగా రూ..1700 వందల కోట్లు వసూళ్లు వచ్చాయి. మే 4 న చైనాలో కూడా బాహుబలి 2 చిత్రం విడుదల అవుతోంది. 1700 కోట్ల మార్కును దాటి 2000 దిశగా పరుగెడుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ అంతకంటే ముందు ఈ చిత్రం దంగల్ రికార్డు ను బ్రేక్ చేసిందనే వార్త వైరల్ అవుతోంది. అసలు విషయమేంటంటే చైనాలో దంగల్ సినిమా 7000 వేల స్క్రీన్ లలో విడుదలయింది. తాజాగా బాహుబలి 7000 వేల పైగానే స్క్రీన్ లలో బాహుబలి 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. దీంతో దంగల్ ను బ్రేక్ చేసింది ఇది సంగతి.

Show Full Article
Print Article
Next Story
More Stories