ప్రముఖ హీరో భార్యకు క్యాన్సర్..

Submitted by chandram on Thu, 11/29/2018 - 16:06
ayush

ప్రముఖ భారతీయ నటుడు, గాయకుడు, వ్యాఖ్యాత హీరో ఆయుష్మాన్ ఖురానా సతీమణీ అయినటువంటి తహీరా కశ్యప్ తాజాగా కొన్ని చిత్రాల్లో, సీరియల్స్ కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు తహీరా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇటివలే తనకు రొమ్ము క్యాన్సర్ వచ్చిందని అయితే ఇప్పుడు అది మొదటి దశలో ఉందని వెల్లడించింది. దినిపై పట్ల ఎవరు కూడా భాదపడొద్దని, ఎవ్వరు ఆందోళన చెందోద్దని తెలిపింది. ఇప్పుడు స్టేజ్‌ 1లో ఉన్నా. ఇప్పటికి ఆరు సెషన్లు పూర్తయ్యాయి. ఇంకో ఆరు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేనెప్పటికీ ధైర్యం కోల్పోనని నా భర్త, స్నేహితులకు మాట ఇస్తున్నా అని మొదటి దశలోనే ఈ విషయం బయటపడింది’ అని తహీరా ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్‌ ఉంచారు. ఇప్పుడు నా పరిస్థితి హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి మాదిరిగానే తయారయ్యే ప్రమాదం ఉందని ఆమెకు కూడా క్యాన్సర్ సోకడంతో ఓ వక్షోజాన్ని తీసేసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ సోకడం జీవితం గురించి తెలుసుకొనే ఓ పరమార్థం లభించింది అని తాహీరా వెల్లడించారు. 

English Title
Ayushmann Khurrana's wife Tahira diagnosed with cancer again: We shall overcome

MORE FROM AUTHOR

RELATED ARTICLES