అయోధ్యలో హై టెన్షన్‌.. 144 సెక్షన్‌ అమలు!

అయోధ్యలో హై టెన్షన్‌.. 144 సెక్షన్‌ అమలు!
x
Highlights

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందుత్వ పార్టీలు మళ్లీ రామజపాన్ని అందుకున్నాయి. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలనే డిమాండ్ పెరుగుతోంది. దాంతో...

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందుత్వ పార్టీలు మళ్లీ రామజపాన్ని అందుకున్నాయి. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలనే డిమాండ్ పెరుగుతోంది. దాంతో అయోధ్యలో మళ్లీ టెన్షన్‌ పెరుగుతోంది. వివాదాస్పద బాబ్రీ మసీదు స్థలంలో ఆలయం నిర్మించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతోన్న వీహెచ్‌పీ, శివసేనలు రేపు అయోధ్యలో భారీ ర్యాలీకి, సభకు పిలుపునిచ్చాయి. దాంతో అయోధ్యలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయోధ్య అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రామమందిర నిర్మాణం కోసం వీహెచ్‌పీ, శివసేన రేపు అయోధ్యలో ధర్మసభను తలపెట్టడంతో... తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లక్షలాది మంది కరసేవకులతో ర్యాలీకి వీహెచ్‌పీ, శివసేనలు పిలుపునివ్వడంతో అయోధ్యలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. సున్నితమైన ఇష్యూ కావడంతో... యూపీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. దాంతో సభా ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇప్పటికే వేలాది మంది కరసేవకులు అయోధ్యకు చేరుకున్నారు, నాలుగైదు ప్రత్యేక రైళ్లలో పెద్దఎత్తున అయోధ్యకు తరలివచ్చారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాల్సిందేనంటున్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే... ఈ ధర్మసభకు ముఖ్యఅతిథిగా హాజరుకానుండటంతో... పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే అయోధ్య చేరుకున్న ఉద్ధవ్‌ ఠాక్రే, తన సతీమణి రష్మీ, కుమారుడు ఆదిత్యకు శివసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలంటూ, కొంతకాలంగా డిమాండ్ చేస్తోన్న శివసేన డిమాండ్ చేస్తోంది, అంతేకాదు 17 నిమిషాల్లో బాబ్రీ మసీదును కూల్చేశామని, అయితే ఆర్డినెన్స్‌ను తీసుకురావడానికి ఇంకెంత కాలం పడుతుదని ప్రశ్నిస్తోంది.

ఇక వీహెచ్‌పీ, శివసేన ర్యాలీ, ధర్మసభపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అయోధ్యను రణరంగంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. వీహెచ్‌పీ, శివసేన ర్యాలీ నేపథ్యంలో అయోధ‌్యలో ఆర్మీ దళాలతో రక్షణ కల్పించాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ సుప్రీంను ఆశ్రయించారు. అయితే వీహెచ్‌ఫీ, శివసేన ర్యాలీకి ఐదారు లక్షల మంది హాజరవుతారనే అంచనాలతో... యోగి ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ధర్మసభ ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అయోధ్యలో ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories