మోడీ ఇలాకా కంటే భారీ విగ్రహం...221 మీటర్ల ఎత్తులో

Submitted by chandram on Tue, 11/27/2018 - 15:50
yogi

ఐక్యతా ప్రతిమను సర్దార్ వల్లభభాయి పటేల్ 143వ జయంతి సందర్భంగా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అని పిలుస్తున్నారు. కాగా పటల్ విగ్రహాం కంటే భారీ ఎత్తులో 221 మీటర్ల ఎత్తులో స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్ పేరుతో  రాముడి భారీ విగ్రహాం సన్నద్దం చేస్తున్నారు. ఇప్పటికే దినికి సంభందించిన అన్ని డిజైన్లను సీఎం ఖరార్ చేసినట్లు తెలుస్తుంది. అయితే విగ్రహా నిర్మాణం విషయానికి వస్తే పునాది 50మీటర్లు, విగ్రహం ఎత్తు 151, విగ్రహం పై ఉండే గోడుగు 20 మీటర్లు కల్లు చెదిరిపోయేలా విగ్రహన్ని రూపుదిద్దామని అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం అవుతుందని స్పష్టం చేశారు. 221 మీటర్ల ఎత్తులో యోగి సర్కార్ దీన్ని నిర్మిస్తోంది. సరయూ నది ఒడ్డున నిర్మించే రాముడి కాంస్యవిగ్రహం చుట్టుపక్కల పర్యాటక రంగం అభివృధ్ది చెందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 
 

English Title
Ayodhya-Ram-Statue in up

MORE FROM AUTHOR

RELATED ARTICLES