అయేషా మీరా హత్యకేసులో ఇవాళ కీలక పరిణామం

అయేషా మీరా హత్యకేసులో ఇవాళ కీలక పరిణామం
x
Highlights

బీ ఫార్మసీ విద్యార్ధిని అయేషా మీరా హత్యకేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అనుమానితులకు నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతించాలంటూ సిట్ దాఖలు...

బీ ఫార్మసీ విద్యార్ధిని అయేషా మీరా హత్యకేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అనుమానితులకు నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతించాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై కాసేపట్లో విజయవాడ నాల్గవ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయేషా హత్య కేసులో నిజా నిజాలు తేలాలంటే నార్కో అనాలసిస్ పరీక్షల చేయడం తప్ప మరో మార్గం లేదని సిట్ వాదిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సిట్..వారికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయడానికి అనుమతించాలని కోరింది. న్యాయస్థానాల అనుమతి లేకుండా నిందితులకు నార్కో పరీక్షలు చేయరాదంటూ గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కారణంగా సిట్ విజయవాడ నాల్గవ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించింది. పదేళ్ల నాటి హత్యపై రెండోసారి జరుగుతున్న దర్యాప్తునకు కోర్టు నిర్ణయం కీలకం మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories