చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి

Submitted by arun on Sat, 01/06/2018 - 11:37

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కడప కలెక్టర్‌ బాబూరావునాయుడు, టీడీపీ కార్యకర్త విజయ్‌కుమార్‌రెడ్డిలు తనను అవమానించారంటూ కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్‌‌కు ఫిర్యాదు చేశారు. జన్మభూమి వేదికపై ఒక రౌడీషీటర్‌ ఉండటమే కాకుండా తన చేతిలో నుంచి మైక్‌ లాక్కుని దౌర్జన్యానికి దిగారని కంప్లైంట్‌‌లో పేర్కొన్నారు. తన గౌరవానికి భంగం కలిగించినవారిపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌‌‌ను కోరారు.

English Title
avinash reddy filed complant on cm chandra babu

MORE FROM AUTHOR

RELATED ARTICLES