ఐమ్యాక్స్‌ వద్ద ప్రేక్షకుల ఆందోళన

Submitted by chandram on Fri, 12/07/2018 - 13:11
i max

డిసెంబర్ 7కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ అంతటా జోరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఎన్నికల సందర్భంగా నేడు అన్ని  ప్రయివేటు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రయివేట్ సంస్థలకు సెలవు దినంగా ఈసి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ అంతటా ఎక్కడిక్కడ బంద్ వాతావరణం కనిపిస్తుంది. అయితే కొందరు సెలువు దినాన్ని అదునుగా చేసుకొని సినిమా థియేటర్ల వైపు బాట పట్టారు. కాగా నగరంలోని ఐమ్యాక్స్ థియేటర్ కు కొందరు సినీ అభిమానులు చేరుకున్నారు. ఎన్నిల కోడ్ నేపథ్యంలో నేటి ఉదయం షో ను ప్రదర్శించలేదు. దింతో తాము ఆన్ లైన్ లో టికెట్లు పొందిన ప్రేక్షకులు థియేటర్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. యాజమాన్యం తిరిగి డబ్బులు చెల్లించడంతో వివాదం కొలిక్కివచ్చింది.
 

English Title
The audience's concern at IMAX

MORE FROM AUTHOR

RELATED ARTICLES